Monday, September 9, 2024

ఏసీబీ చిక్కిన మానుకోట‌ స‌బ్‌రిజిస్ట్రార్ త‌స్లీమా

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : ఏసీబీ అధికారుల‌కు మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ త‌స్లీమా రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం నుంచి మ‌హ‌బూబాబాద్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో భూ రిజిస్ట్రేషన్ల‌ కోసం రూ. 19200 లంచం డిమాండ్ చేస్తూ ఆమె ప‌ట్టుబ‌డ్డారు. మరో లక్ష 78 వేల రూపాయలను డాక్యుమెంట్ రైటర్ల నుండి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి…

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్ ఒకఎకరం 28 గుంటల భూమి కొనుగోలు చేశారు. అందులో 128 గజాలు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మార్చి మొదటి వారంలో వచ్చారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకట్‌ను కలిసి నగదును ఇవ్వాలని మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లిమా చెప్పారు. ఈ క్రమంలో హరీష్ లంచం ఇవ్వడం ఇష్టం లేక వరంగల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం హరీష్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వెంకట్ కు 19 వేల 500 డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు వరంగల్ ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అంతేకాకుండా రూ.1,72,000 కు సరైన లెక్కలు లేనందున వాటిని కూడా సీజ్ చేసినట్లు తెలిపారు.

వరంగల్ రేంజ్, ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో మహబూబాబాద్ సబ్ రాజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జ‌రిగాయి. మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్‌ తస్లీమామహమ్మద్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేష్ ఇరువురిపై కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img