Tuesday, September 10, 2024

పోలీస్ అధికారిపై పోక్సో కేసు

Must Read

అక్షరశక్తి హన్మకొండ క్రైమ్ ; కాకతీయ యూనివర్సిటీ పోలీస్టెషన్ లో గతంలో  ఎస్సై గా పనిచేసి ప్రస్తుతం సీఐగా పొరుగు జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారి పై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదైనట్లు అధికారక సమాచారం.2022 ఇయర్ లో కేయు లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో సదురు అధికారి స్టేషన్ పరిధిలో ఒక మహిళతో సన్నిహిత సంబంధాలనట్లు సమాచారం. ఈ విషయంలో మహిళా భర్త పోలీస్ కమిషనర్ కు పిర్యాదు చేయగా ఏఆర్ కు అటాచ్ చేసినట్లు తెలిసింది. అనంతరం సీఐగా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లాకు,అటునుంచి భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వెళ్లిన సదురు అధికారి ఇంకా మహిళాతోనే సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నట్టు సమాచారo. ఈ క్రమంలో సదరు మహిళా కూతురిపై కన్నేసిన పోలీస్ అధికారి అత్యాచార అత్యాచారాయథాన్నికి పాల్పడినట్లు ఇటీవల కేయు పీఎస్ లో మహిళా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విచారణ చేసిన కేయు పోలీసులు.. గురువారం సదరు అధికారి పై అత్యాచార యత్నం, ఫోక్స్ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై కేయు సిఐని వివరణ కోరగా నిజమే అని చెప్పారు.  కేయు పీఎస్ లో కేసు నమోదు అయినదని, కస్టడీ లో ఉన్నాడని అన్నారు. రహస్యoగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img