Saturday, July 27, 2024

ఎంజీఎంలో అత్యాధునిక వైద్యం

Must Read
  • మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు
    అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆస్ప‌త్రికి వ‌చ్చే రోగుల‌కు అత్యాధునిక వైద్య విధానం అందించ‌డ‌మే తెలంగాణ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. ఆస్ప‌త్రిలోని క్యాజువాలిటీలో 3 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యంత్రాన్ని సోమ‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలతో అత్యాధునిక సిటి స్కాన్ అత్యవసర విభాగం వద్ద ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు. 12 కోట్ల రూపాయలతో ఎంజీఎం ఆస్పత్రిలో ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిం చామ‌న్నారు. 40 సంవత్సరాల లో జరగని అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వంలో ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిందన్నారు. వైద్యానికి మొద‌టి ప్రాధాన్యత క‌ల్పించి పేద‌లంద‌రికీ వైద్యం అందిండానికి ప్ర‌భుత‌క్వం కృషి చేస్తుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో చీఫ్ విప్ విన‌య్‌భాస్క‌ర్‌, మేయ‌ర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బ‌స్వ‌రాజు సార‌య్య‌, జిల్లా క‌లెక్ట‌ర్ గోపి త‌దిత‌రులు పాల్గొన్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img