అక్షరశక్తి వరంగల్: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదాను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ హైదరాబాదులో శిక్షణ పొందుతున్న అధికారులు శుక్రవారం మర్యాదపూర్వకంగా
జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ జూబ్లీహిల్స్ హైదరాబాదులో శిక్షణ పొందుతున్న 20 మంది సెంట్రల్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ సెక్షన్ ఆఫీసర్లు జూలై 29 నుండి ఆగస్టు 2 వరకు జిల్లాలోని గీసుకొండ మండలంలోని గంగాదేవి పల్లి, మరియాపురం గ్రామాలను, వర్ధన్నపేట మండలం, ఇల్లందు, సంగేమ్ మండలంలోని తీగరాజు పల్లి గ్రామాలను సందర్శించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వాటి అమలు తీరును అవగతం చేసుకున్నారు. సందర్శన ముగింపు సందర్భంగా కలెక్టర్ ను కలసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు , గ్రామాల అభివృద్ధికి ఏవిధంగా దోహద పడతాయనే విషయాలను వివరించారు. అందించిన సూచనలు, సలహాలు భవిషత్తులో ప్రణాళికలు రూపొందించుటకు ఉపయోగ పడతాయని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి డి ఆర్ డి ఓ కౌశల్య దేవి, జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, ఇటిసి ప్రిన్సిపాల్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ను కలసిన సెంట్రల్ ట్రైనీ అసిస్టెంట్ స్టాటిస్టికల్, సెక్షన్ ఆఫీసర్లు
Must Read