అక్షర శక్తి కమలాపూర్: కమలాపూర్ నూతన ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన సురేశ్న ను, కాంగ్రెస్ యూత్ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. రెవెన్యూ సమస్యల పైన, మండలంలో ఉన్న రైతులకు సహాయ సహకారాలు అందించి తమ సేవలను అందించాలని విజ్ఞప్తి చేశారు. అనేక భూ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంధసిరి బిక్షపతి, పుల్ల మహేందర్, తాళ్లపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.