హత్య కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడటానికి కృషి చేసిన ఇద్దరు ఇన్స్ స్పెక్టర్లతో పాటు గతంలో వరంగల్ లో పనిచేసిన ఏసీపీ ఎస్. ఐలకు డిజిపి చేతుల మీదుగా మంగళవారం ప్రశంస పత్రాలను అందజేశారు.
అక్షరశక్తి వరంగల్: హైదరాబాద్ లోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయములో రాష్ట్ర డిజిపి జితేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ అధికారుల సమావేశంలో రాష్ట్ర డిజిపితో పాటు పోలీస్ ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హత్య కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడటంలో కృషి చేసిన, కేసు దర్యాప్తు అధికారి ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ప్రశంస పత్రాలను అందించారు. ఇందులో భాగంగా 2020 సంవత్సరంలో హాసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో అప్పటి స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ ప్రస్తుతం సిసి ఆర్ బి గా పనిచేస్తున్న శ్రీధర్ రావు తో కోర్టులో పోలీస్ తరుపున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజమల్లారెడ్డికి, మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 సంవత్సరంలో జరిగిన హత్య కేసులో అప్పటి మడికొండ ఇన్స్ స్పెక్టర్ ప్రస్తుతం మామనూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ రవికుమార్, వాదనలు వినిపించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డిప్యుటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సత్యనారాయణ రెడ్డికి, చెన్నారావు పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2016లో జరిగిన హత్య కేసులో అప్పటి నర్సంపేట ఏసీపీ ప్రస్తుతం అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్, అప్పటి చెన్నారావుపేట ఎస్. ఐ ప్రస్తుతం తొర్రుర్ ఎస్. ఐ జగదీశ్ తోపాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మర్రి వాసుదేవ రెడ్డి లకు రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందుకున్నారు. ఈ సందర్బంగా ప్రశంస పత్రాలు అందుకున్న అందుకున్న పోలీస్ అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ అభినందించారు.