అక్షర శక్తి కాశీబుగ్గ: వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ ధర్మారం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్చధనం – పచ్చధనం కార్యక్రమాన్ని ప్రారంభించి అవగాహన ర్యాలీ నిర్వహించిన స్థానిక కార్పొరేటర్ సుంకరి. మనీషా శివకుమార్. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ప్రశాంత్, వార్డ్ ఆఫీసర్ మల్లికార్జున్, జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు సిబ్బంది, అర్బన్ మలేరియా సిబ్బంది, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, విద్యా కమిటీ చైర్మన్ లు, స్థానిక గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.