అక్షరశక్తి, హన్మకొండక్రైం : వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం హనుమకొండ ఏసీపీ కార్యాలయంను తనిఖీ చేశారు. ఈ తనిఖీ కోసం వెళ్ళిన పోలీస్ కమిషనర్ కు ఏసీపీ దేవేందర్ రెడ్డి పుష్పాగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ కార్యాలయము పనితీరుకు సంబంధించి వివిధ పోలీస్ రికార్డులను పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ముఖ్యంగా ఏసీపీ పరిధిలోని దర్యాప్తు కేసుల స్థితిగతులతో పాటు నేరస్తుల అరెస్టు సంబంధించిన అంశాలపై పోలీస్ కమిషనర్ తనిఖీ చేశారు. ఈ అనంతరం పోలీస్ కమిషనర్ ఏసీపీ కి పలు సూచనలు చేస్తూ ఏసీపీ స్థాయి అధికారి పరిధిలోని పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పడు పర్యవేక్షణ చేయడంతో కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా జరిగేందుకు స్టేషన్ అధికారులకు సహకారం అందించాలని. ప్రధానంగా రౌడీ షీటర్ల వ్యవహారంపై నిరంతరం నిఘా పెట్టడంతో పాటు, కొత్తగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై నూతనంగా రౌడీ షీట్లు తెరవాలని, గతంలో జరిగిన చోరీ కేసులను పరిష్కరించడంతో పాటు చోరీ లను కట్టడి చేయడం ప్రత్యేక దృష్టి పెట్టాలని, అలాగే శాంతి భద్రతలకు సంబంధించి నిరంతరం పర్యవేక్షణ చేస్తూనే అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ తనిఖీల్లో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమాతో పాటు హనుమకొండ డివిజనల్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు