Thursday, September 19, 2024

రెవెన్యూ ముసాయిదా బిల్ – 2024 పై చర్చ

Must Read

అక్ష‌ర‌క్తి వరంగల్: వ‌రంగ‌ల్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో తెలంగాణ తహసిల్దార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రెవెన్యూ ముసాయిదా బిల్ 2024 మీద చర్చ నిర్వహించడం జరిగింది. ఈ చర్చలకు గాను డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు లచ్చి రెడ్డి రామకృష్ణ టి జి టి ఏ జనరల్ సెక్రెటరీ పాక రమేష్ సెక్రెటరీ జనరల్ ఫుల్ సింగ్ వరంగల్ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇక్బాల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ విక్రమ్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్, హనంకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగాం జిల్లా నుంచి వీఆర్ఏ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు అందరూ రెవెన్యూ ఉద్యోగులు పాల్గొని నూతన రెవెన్యూ చట్టం 2024 లోని ఈ క్రింది ప్రధాన అంశాలను గురించి చర్చించడం జరిగినది.

1. రాజ్యాంగం తరహలో కొత్త ఆర్ఓఆర్ చట్టం రూపకల్పన – స్వాధీనంలో భూమి, చేతిలో పట్టా, రికార్డులో పేరు ఈ మూడు ఉన్నప్పుడే ఏ రైతుకైనా సంపూర్ణ హక్కులు దక్కుతాయని, ఈ మూడు కొత్త ఆర్వో ఆర్ చట్టంలో ఉన్నాయి.

2. కొత్త చట్టంతోనే రైతులకు సేవలు చేరువ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం-మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రూల్స్ ని మార్చుకునే వెసులుబాటు ఈ చట్టంలో ఉంది. అదేవిధంగా గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనున్నారు.

3. రైతులు కోర్టుల మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉండదు-కొత్త చట్టం ప్రకారం రైతులకు రెవెన్యూ సేవలు అందుబాటులో ఉండనున్నాయి వారు ఇకపైన కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు.

అదేవిధంగా ఈ కార్యక్రమంలో బారసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ ఆదర్శ లా కాలేజ్ ప్రిన్సిపల్, విద్యాసాగర్ అదేవిధంగా పొట్లపల్లి రవీందర్ ఆర్టిఐ ఆక్టివిస్ట్ రిటైర్డ్ తాసిల్దార్స్, డిప్యూటీ కలెక్టర్స్ అందరూ పాల్గొని తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చినారు. గత బిల్లులలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం లో ప్రవేశపెట్టినటువంటి రెవెన్యూ చట్టం ప్రకారం సామాన్య రైతులకు తహసీల్దార్ లెవెల్లో గాని, ఆర్డీవో లెవెల్లో గాని, జాయింట్ కలెక్టర్ లెవెల్లో గాని సమస్య పరిష్కారం కాలేదు. ఎందుకంటే కెసిఆర్ ప్రభుత్వము రెవెన్యూ కోర్టులను రద్దు చేయడం వలన అప్పిలు చేసుకోవడానికి వీలు లేక, సామాన్య రైతు కూడా హైదరాబాద్ సిసిఎల్ఏ ఆఫీస్ వరకు పోయే పరిస్థితి ఏర్పడింది. కోర్ట్ ల ద్వారానే సమస్య పరిష్కరించే అవకాశం ఉండేది. దాంతో రైతులు ఎంతోమంది నష్టపోయారు. 18 రాష్ట్రాలలో ఉన్నటువంటి రెవెన్యూ చట్టాలను సమగ్రంగా చదివి, సమగ్రంగా పరిశీలించి మరి నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వాలలాగా చీకటి ఒప్పందం కాకుండా ప్రజల అభిప్రాయాల మేరకు ప్రజల ముందుకు ఈ చట్టాన్ని ముసాయిదా బిల్లుగా తీసుకువచ్చి, ప్రజల, న్యాయవాదుల, ప్రజా ప్రతినిధుల సామాన్య రైతుల, ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకోవడం అనేటువంటిది తెలంగాణ ప్రజా పాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే సాధ్యం. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం కావడంతో ప్రజలకు సేవలు దూరం అయ్యాయని రైతులకు ప్రజలకు మెరుగైన సేవలు అందాలంటే కొత్త ఆరు చ‌ట్టాల‌ తోనే సాధ్యం అని మొహ్మద్ ఇక్బాల్ అన్నారు. ఫూల్ సింగ్ చౌహన్ జనరల్ సెక్రటరీ టీజీటీఏ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో భూ పరిపాలన వ్యవస్థలను పరిష్కరించేందుకే కొత్త చట్టం. చట్టం అంటే ఎక్కడో కూర్చుని చేస్తే దాంతో ప్రజలకు సేవలు అందమన్నారు. ప్రజల నుంచే చట్టం రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త చట్టం యొక్క ముసాయిదాను పబ్లిక్ డొమైన్ లో ఉంచిందని, గత పాలకులు చట్టాన్ని చేసి ప్రజల ముందుకు తెచ్చేవారని, కానీ ప్రజా ప్రభుత్వం చేసి ప్రజల ముందుకు తెచ్చిందని అన్నారు.

“రైతే రాజు అని, రైతులే మన భూములకు హృదయస్పందన అని మర్చిపోకుండా, వారికి సేవ చేసుకునే దిశలో ఈ చట్టం రూపకల్పన.”

రమేష్ పాక (జనరల్ సెక్రటరీ,టీజీటీఏ) మాట్లాడుతూ, ప్ర‌స్తుతం ఉన్న ఆర్ఓఆర్ చట్టంతో ఏ చిన్న సమస్య వచ్చినా సివిల్ కోర్టుకి పోవాల్సిన పరిస్థితి ఉంది. రైతు ఒకటిలేదా రెండు విషయాలకు తప్ప ప్రతిదానికి కోర్టుకు వెళ్లడం చాలా భారంగా మారింది. ఇది సాధారణ రైతులకు సాధ్యం కాని విషయంగా ఉంది. 2020 ఆర్ ఓ ఆర్ చట్టంలో అప్పీలు, రివిజన్ చేసే మెకానిజం లేకుండాపోయింది. కొత్త చట్టం ప్రకారం రైతులకు రెవెన్యూ సేవలు అందుబాటులో ఉండేలా ఉందన్నారు. దీనిలో చిన్న చిన్న మార్పులు చేసుకొని చట్టం గా తీసుకువస్తే రైతుల కష్టాలు తీరుతాయి..ఈ చట్టం అత్యున్నతమైన చట్టంగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు అంతేకాకుండా రైతులకు చాలా ఫ్రెండ్లీగా ఉంటుందని అధికారులకు, రైతులకు మేలు చేసే చట్టంగా ఉండబోతోంది అని అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img