Tuesday, September 10, 2024

శాయంపేట ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేసిన హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

Must Read

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ : హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఈ రోజు శాయంపేట ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేశారు. సంబంధిత ఏ‌ఎన్‌ఎం మరియు ఆశాల నుండి వారు అందించే సేవలను అడిగి తెలుసుకున్నారు. వారి పరిధిలో నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వే వివరాలను తెలుసు కొని సంబంధిత రికార్డులను, మలేరియా, డెంగ్యూ కిట్స్ లను పరిశీలించారు. గృహ సందర్శన సమయంలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు తెలియచేయాలని, జ్వరంతో ఉన్నవారికి ఫాలో అప్ సేవలు అందించాలని, వారి వివరాలను వైద్య అధికారులకు తెలియచేయాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలో గ్రామ పంచాయత్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సమాఖ్య సభ్యులతో సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఉప కేంద్ర పరిధిలో ఉండవలసిన మందుల జాబితాను రిజిస్టర్ లో అంటించి అందుబాటులో ఉన్న మందులను, వాటి వినియోగాన్ని స్టాక్ రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. గర్భిణీ స్త్రీ లకు 4 సార్లు పరీక్షలు జరిపించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగేలా ప్రోత్చహించాలని ప్రమాదకర లక్షణాలు గుర్తించిన వారి పట్ల ప్రత్యేక శ్రద్ద చూపించాలన్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రం సందర్శించి పిల్లలకు అందిస్తున్న పౌష్టిక ఆహార పదార్థాలను పరిశీలించి పిల్లలతో ముచ్చటించారు. పిల్లల బరువు, ఎత్తు పరీక్షించే విధానాన్ని పరిశీలించారు. ఆ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి తీవ్ర పోషకాహార లోపం ఉన్న పిల్లలను వివరాలను తెలిసు కున్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి వైద్య అధికారితో పరీక్షలు నిర్వహించాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్.కె. లలితా దేవి, మహిళా శిశు సంక్షేమ అధికారి రాజమణి, స్థానిక వైద్య అధికారి డాక్టర్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img