అక్షరశక్తి హనుమకొండా: మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలనీ వాసులను పోలీస్ లు హెచ్చరించారు. మడికొండ కాలనీ ప్రాంతానికి ఉత్తర భారత్ నుండి అంతర్రాష్ట్ర దొంగల ముఠా వచ్చి సంచరిస్తుందని తెలిపారు. ఇంటి యజమానులు ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు గానీ లేక వేరే ఊరికి వెళ్లినప్పుడు. మీకు నమ్మకస్తులైన వారికి గానీ పక్క ఇంటి వారికి గానీ లేదా మడికొండ పోలీస్ వారికి సమాచారం ఇచ్చి వెళ్లవలసిందిగా కోరారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానస్పదముగా కనిపించినా, ఎస్ హెచ్ ఓ మడికొండ పోలీసులకు 87126 85123, 8712685009 నెంబర్లకు మాచారం ఇవ్వాలని తెలిపారు.