అక్షరశక్తి, హన్మకొండ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ, జిల్లా సంక్షేమ అధికారి సంయుక్త ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం నిర్వహించడానికి ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామంలో ఒక ఎకరం భూమిని జిల్లా కలెక్టర్ కేటాయించారు. ఈ భూమిని శనివారం హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకమండలి సభ్యులు ఇ.వి. శ్రీనివాస్ రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణు గోపాల్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, డాక్టర్ మాగంటి శేషుమాధవ్, జిల్లా సంక్షేమ అధికారి జి. లక్ష్మికాంతరెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా పాలకవర్గం మాట్లాడుతూ అతి త్వరలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి సంయుక్త అద్వర్యం లో వృద్ధాశ్రమం నెలకొల్పుతామని తెలిపారు.