అక్షరశక్తి, పరకాల: సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో శనివారం శ్రీ మహాలక్ష్మి పోచమ్మ గుడి, హనుమాన్ గుడి లో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గోన్నారు. కాట్రపల్లి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకి గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పూజారులు వేదమంత్రాల మధ్య ఆశీర్వచనలు అందించి పూజలు నిర్వహించారు, అనంతరం గ్రామ ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలకు శాలువా కప్పి సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారలు అందిస్తానని తెలిపారు. దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు అని అన్నారు.