అక్షరశక్తి, పరకాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ 2024-25 సంవత్సరనికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరిచారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చదువు మానేసిన వారికి మరియు ఉద్యోగులకు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి చాలా ఉపయోగకరమని, ఉద్యోగులు పదోన్నతి పొందుటకు మరియు బడి మధ్యలో మానేసినటువంటి వారికి ఇది చక్కని అవకాశం దీనిని సధ్వినియోగం చేసుకోవాలని తెలిపారు. యువతి యువకులకు మహిళలకు పురుషులకు విద్యను ఓపెన్ ద్వారా నిర్వహిచడం జరుగుతుంది. ఒక్క సంవత్సరంలోనే పదో తరగతి చదువుకోవచ్చు మరియు ఒక్క సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదువుకోవచ్చు కేవలం ఇంటర్మీడియట్ లో ఐదు సబ్జెక్టులు మాత్రమే వుంటాయి. రెగ్యులర్ గా చదవ లేని వారికి ఇలాంటి అవకాశాలు వినియోగించుకోవాలని అన్నారు. పాఠశాల ఉపాద్యాయులు నాగయ్య ఏసిపి చిత్రపటం గీసి ఆయనకు బహుకరించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.