అక్షరశక్తి, హైదరాబాద్: ఎస్సీల వర్గీకరణ కోసం మూడు దశాబ్దాల నుండి అలుపెరగకుండా పోరాటం చేసి నేడు సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీల వర్గీకరణను సాధించి మూడు దశాబ్దాల మాదిగల ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చి ఎస్సీల వర్గీకరణను సాధించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగని హైదరాబాదులో ఎమ్మార్పీఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ ఆధ్వర్యంలో హనుమకొండ మండల నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కలిసిన వారిలో ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి మంద స్వరాజ్ మాదిగ, మండల అధ్యక్షులు ఎర్ర రాము మాదిగ, ఉపాధ్యక్షులు బొక్క రాజేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శి సిలువేరు భిక్షపతి మాదిగ, అలువల ఎల్లెష్ మాదిగ, సిలువేరు చిన్న మాదిగ, మల్లెపాక సాయిదీప్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.