Tuesday, September 10, 2024

సంపూర్ణ రుణమాఫీని అమలు చేయాలి

Must Read

అక్షరశక్తి, కొత్తగూడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు సంపూర్ణ రుణమాఫీని అమలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పూనేం ప్రభాకర్ ముల్కూరి జగ్గన్నలు అన్నారు. సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో నేడు కొత్తగూడ ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా రైతు రుణమాఫీ మూడు విడతలుగా చేసిన ఇంకా 40 శాతం మంది అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తించలేదని అన్నారు. రేషన్ కార్డు ఉండాలని, ఇంటికొకరికే అని, 2018 వరకు రెన్యువల్ చేయాలన తదితర షరతులు పెట్టటం హేయమైన చర్య అని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన 2 లక్షల లోపు రైతుల రుణమాఫీని అమలుచేసి వెంటనే నూతన పంట రుణాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రైతు పంటకు గిట్టుబాటు ధర చట్టం తీసుకురావాలని రైతు ఆదాయం రెట్టింపు చేస్తానని గొప్పలు చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ రైతు పంటకు గిట్టుబాటు ధర కల్పించే చట్టాన్ని ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల బకాయిలు రద్దు చేయడం, టాక్స్లు మినహాయింపు ఇవ్వటం లాంటి ఎన్నో సహాయక ప్రోత్సాహాలిస్తూ దేశానికి అన్నం పెట్టే రైతుకు మాత్రం మొండి చేయి చూపెట్టడం తగదన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రగతిశీల రైతు సంఘం నాయకులు పైండ్ల యాకయ్య ఈక బిక్షం గొంది సమ్మన్న కంగాల పాపయ్య కురుసం రంగయ్య ముద్రబోయిన కొమ్మాలు మాజీ ఎంపీటీసీ కల్తీ ఎర్రక్కమల్లేశం తదితరులు పాల్గొన్నారు. స్పందించిన ఎమ్మార్వో ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇచ్చారు…..

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img