అక్షరశక్తి వరంగల్: గత ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచే లక్ష్యంగా “స్వీప్” ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఓటరు చైతన్య కార్యక్రమాల విజయవంతంలో వివిధ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతైనా
ఉందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టరం సత్యశారద అన్నారు. గత ఎన్నికలలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైన జిల్లాలలో ఓటింగ్ శాతంన్ని పెంచే లక్ష్యంగా “మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్” ఆధ్వర్యంలో మోర భూపాల్ రెడ్డి ఐఆర్ ఎస్ సారధ్యంలో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో నిర్వహించిన “ఓటర్ చైతన్య కార్యక్రమాల నివేదిక” ను శనివారం నాడు ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమాలైనా, పౌర సమాజ చైతన్యంతో, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతోనే విజయవంతం అవుతాయన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ వరంగల్, హనుమకొండ జిల్లాల కన్వీనర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత పరికిపండ్ల వేణు మాట్లాడుతు “గాంధీ – గుడి” ఆధ్వర్యంలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఓటర్ అవగాహన “చైతన్య రథం” నుఏర్పాటు చేసుకొని హనుమకొండ, వరంగల్, కాజీపేట త్రినగరిలోని వివిధ కాలనీలలో తిరుగుతు ఓటు హక్కు వినియోగంపై ప్రజలను చైతన్య పరుస్తూ, కరపత్రాలు పంపిణీ చేస్తూ, ప్లాకార్డులతో ర్యాలీలు నిర్వహించి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఓటింగ్ శాతం పెంపుదలకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వాములం అయ్యామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త, అభ్యుదయ సేవా సమితి అధ్యక్షులు మండల పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.
ఓటరు చైతన్య కార్యక్రమం విజయం వెనుక స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతోఉంది- వరంగల్ జిల్లా కలెక్టర్
Must Read