Monday, September 16, 2024

విద్యార్థుల వ్యవహారశైలి పై కాలేజీ యాజమాన్యం పర్యవేక్షణ వుండాలి

Must Read

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: తమ కాలేజీ ల్లో చదివే విద్యార్థుల వ్యవహర శైలి పట్ల కాలేజీ యాజమాన్యంతో అధ్యాపాకుల నిరంతరం పర్యవేక్షణ వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని డిగ్రీ, ఇంటర్మిడియట్ కళాశాలలకు చెందిన యాజమాన్యం, ప్రిన్సిపాల్ లతో వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మత్తు పదార్థాల నియంత్రణతో విద్యార్థుల బంగారు భవిష్యత్తు గంజాయి లాంటి మత్తు పదార్థాలతో చిత్తు కాకుండా విద్యా సంస్థల్లో గంజాయిని కట్టడి చేసేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కాలేజీ యాజమాన్యంను నమ్మి తల్లి దండ్రులు తమ పిల్లలను కాలేజీలకు పంపిస్తున్నారు. మీ కాలేజీల్లో చదివే విద్యార్థుల పట్ల వ్యక్తి శ్రద్ద వుండాలని, వారు ఎలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా కాలేజీ యాజమాన్యం ముందస్తూ చర్యలు తీసుకోవాలని. ఇందుకోసం ప్రతి కాలేజీ లో విద్యార్థుల భాగస్వామ్యంతో యాంటీ డ్రగ్స్ విభాగాన్ని ఏర్పాటు చేయడంతో నిరంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా విద్యార్థుల్లో అవగహన పెంచాలని. అలాగే విద్యార్థుల వ్యక్తిగత అలవాట్లపై దృష్టి పెట్టాల్సి వుంటుందని. ముఖ్యంగా విద్యార్థి వ్యక్తిగత వ్యవహరశైలిలో ఏదైన మార్పు కనిపిస్తే విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందజేయడంతోపాటు విద్యార్ధికి కౌన్సిలింగ్ ఇవ్వాలని.డ్రగ్స్ తీసుకోవడం వల్ల జరిగే ప్రమాదాల గురించి విద్యార్థులకు తెలియజేయాల్సినభాద్యత కళాశాల యాజమాన్యలదే అన్న‌రు. హాస్టల్లో ఆకస్మిక తనిఖీలు చేయాల‌న్నారు. ముఖ్యంగా కాలేజీ పరిసరాల్లో ఎవరైనా గంజాయి విక్రయాలకు పాల్పడిన, సేవిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రగ్స్ కంట్రోల్ విభాగానికి సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో డీసీపీ షేక్ సలీమా, రవీందర్, ఏసీపీ లు జితేందర్, తిరుమల్ తో పాటు ఇతర పోలీస్ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img