- 15న బాధ్యతల స్వీకరణ
అక్షరశక్తి, డిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఈసీలో కమిషనర్‌గా ఉన్నారు. సీఈసీగా ఈ నెల 15న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర రేపు పదవీ విరమణ చేయనున్నారు. ఈసీలోని కమిషనర్లలో అత్యంత సీనియర్‌ను సీఈసీగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిని అనుసరించి రాజీవ్ కుమార్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సీఈసీగా నియమించారు. 2025 ఫిబ్రవరి వరకు రాజీవ్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం సారథిగా ఉంటారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు 2024లో సార్వత్రిక ఎన్నికలు కూడా ఆయన నేతృత్వంలోనే పూర్తికానున్నాయి. బీహార్/ఝార్ఖండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్ 2020 ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశారు. 2020 సెప్టెంబరు ఒకటో తేదీన ఎన్నికల కమిషనర్ కావడానికి ముందు ప్రభుత్వరంగ సంస్థల ఎంపిక మండలి ఛైర్‌పర్సన్‌గా సేవలందించారు.
Must Read