- వరంగల్ – కరీంనగర్ జాతీయ రహదారిపై ఘటన
- ఏటూరునాగారంలో తీవ్ర విషాదం
అక్షరశక్తి హన్మకొండ క్రైమ్ : హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున పెంచికల్ పేట శివారులో వరంగల్ – కరీంనగర్‌జాతీయ రహదారిపై కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో వరంగల్ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. - ములుగు జిల్లా ఏటూరునాగారం మండలానికి చెందిన మంతెన కాంతయ్య(72), మంతెన శంకర్(60), మంతెన భారత్ (29), మంతెన చందన(16) మృతి చెందగా, మంతెన రేణుక(60), మంతెన భార్గవ్(30), మంతెన శ్రీదేవి(50) తీవ్రగాయాలతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. వీరంతా ఏటూరునాగారం నుంచి గురువారం రాత్రి వేములవాడకు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున హుజూరాబాద్ నుంచి హన్మకొండ వైపు ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో తీవ్ర విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Must Read