అక్షరశక్తి వరంగల్: మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంయుక్త సమర్పణలో నవకళా భారతి ఆర్ట్స్ అకాడమీ మరియు సంస్కార భారతి వారు శాద్ నగర్ లో నిర్వహించిన జాతీయ స్థాయి బాలల నాటకోత్సవాలలో వరంగల్ నుండి రాజేష్ ఖన్నా దర్శకత్వంలో “తీరుమారాలి” సాంఘిక నాటిక ను ప్రదర్శించారు. పిల్లలపై మార్కులు,ర్యాంకులు అంటూ అటు విద్య సంస్థలు..ఇటు తల్లిదండ్రుల వొత్తిడి పెరిగిందని దానివల్ల పిల్లలు మానసికంగా కృంగిపోతున్నారని, ఆట పాటలకు దూరమై పిల్లలు శారీరకంగా,మానసికంగా ఎద గలేక పోతున్నారని…ఆట పాటల ద్వారా చదువు చెప్పడం వల్ల వారిలో ఉన్న సృజనాత్మకతను గుర్తించి వారిని ప్రోత్సహించడం వళ్ళ వారు అన్ని రంగాల్లో రాణించగలరు అని సారాంశంతో సాగే నాటిక ప్రదర్శించగా ప్రభుత్వ స్కూల్ శివనగర్ పిల్లలు ఎంతో అద్భుతంగా నటించారని వారిని ఇక ముందు కూడా ప్రోత్సహిస్తామని ప్రిన్సిపల్ శ్రావణ్, టీచర్లు లక్ష్మి నారాయణ,నరేంద్ర స్వామి, శ్రీనివాస్,రంగా చారి, రాఘవేంద్ర అభినందించారు. దర్శకులు రాజేష్ ఖన్నా పిల్లలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాటికలో నటించిన విద్యార్దులు నాగసిందు, రాం చరణ్, దయా సాగర్, క్రాంతి తదితరు పాల్గొన్నారు.