అక్షర శక్తి పరకాల: భారతీయ జనతా పార్టీ నడికూడా మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మండలంలోని సమస్యలపై ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రబారి డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి మరియు పరకాల కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ..నడికూడా లో సొంతభవనంతోనే పోలీస్ స్టేషన్ వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. నడికూడా మండల పరిధిలోని నాలుగు గ్రామాలు దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి, వాటిని కూడా నడికూడా పోలీస్ స్టేషన్లో కలపాలి. నడికుడా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిధిని శాయంపేట నుంచి నడికుడకు లేదా పరకాల పోలీస్ స్టేషన్కు తీసుకురావాలి. మండల ఏర్పాటు చేసి ఆరేండ్లు దాటిన ఇప్పటివరకు ఎంపీడీవో సొంత భవనం లేదు మరియు ఏ ఆఫీసులో కూడా సిబ్బంది పూర్తిస్థాయిలో కూడా లేరు అన్నారు. మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిని వెంటనే ఏర్పాటు చేయాలి. కంఠత్మకూర్ హై లెవెల్ బ్రిడ్జ్ త్వరగా పూర్తి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జు సత్యనారాయణ రావు, కాచం గురు ప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మేకల రాజవీరు, కొత్తగూడెం ప్రభారి దేవునిరి మేఘనాథ్, మండల అధ్యక్షులు గోగుల రాజి రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మార్త రాజభద్రయ్య, అసెంబ్లీ కన్వీనర్ ముల్క ప్రసాద్, పట్టణ అధ్యక్షులు మార్తా బిక్షపతి, మండల ప్రధాన కార్యదర్శులు గొనేల కోటేశ్వర్, బనాల శ్రీనివాస్, దండు సురేష్, ఎరుకల దివాకర్, నల్ల ప్రవీణ్ కుమార్, హరికృష్ణ, మోతే సుదర్శన్ రెడ్డి, జల ఇంద్రసేనారెడ్డి, సల్పాల సురేష్, మొర్రి మొగిలి, కృష్ణారెడ్డి, కృష్ణకర్, బండ రాంప్రసాద్, అల్లం వజ్రం, వెంకన్న, బండ్ల వేణు, కాసగాని రాజ్ కుమార్, కాసగాని సాయి కుమార్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.