Friday, September 13, 2024

పెద్దికి జ‌న నీరాజ‌నం.. న‌ర్సంపేట‌లో టాప్ గేర్‌లో కారు..!

Must Read
  • ఎమ్మెల్యే ప్ర‌చారానికి ఊరూరా అనూహ్య స్పంద‌న‌
  • మంగ‌ళ‌హార‌తులు, కోలాటాల‌తో ఘ‌న స్వాగ‌తం
    అక్ష‌ర‌శ‌క్తి, న‌ర్సంపేట‌: న‌ర్సంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి ప్ర‌చారం ఊరూరా హోరెత్తుతోంది. ఏ గ్రామానికి వెళ్లినా, తండాకు పోయినా జ‌న నీరాజ‌నం ప‌లుకుతోంది. కోలాటా లు, డ‌ప్పుచ‌ప్పుళ్లు, మంగ‌ళ‌హారతుల‌తో మ‌హిళ‌లు ఎదురేగి ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నారు. న‌ర్సంపేట లో కారు టాప్‌గేర్‌లో జోరుగా వెళ్తుండ‌టంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం ఉర‌క‌లేస్తోంది. తాజాగా నల్లబెల్లి మండలంలో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చారానికి అనూహ్య స్పంద‌న ల‌భించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా…. దస్తగిరిప‌ల్లి, ముచ్చింపుల, ముచ్చింపుల తండాల్లో పెద్ది ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌తోనే అభివృద్ధి సాధ్య‌మ‌ని, ప్ర‌తిప‌క్షాల మాయ‌మాట‌లు న‌మ్మి పోస‌పోవ‌ద్ద‌న్నారు. పనిచేసే ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసమే మరోసారి విజయ కేతనం ఎగుర వేస్తుందని గులాబీ శ్రేణుల ధీమావ్య‌క్తం చేస్తున్నాయి. కష్టపడే తత్వం, కలిసిపోయే మనస్తత్వం అన్ని విధాలా సమర్ధుడు పెద్ది మాత్రమే సంక్షేమం, అభివృద్ధికి పెద్ద దిక్కు అంటున్నారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img