అక్షరశక్తి, భూపాలపల్లి : భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీలో కీలక నాయకులంతా కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతుండడంతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎప్పుడు.. ఎవరు.. ఎలా.. షాక్ ఇస్తారో తెలియని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తాజాగా, నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండలంలో కీలక నేత కేఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కట్టంగూరి రామ్‌నర్సింహారెడ్డి బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి, మంగళవారం రాత్రి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. హైదరాబాద్‌లో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో మొగుళ్లపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టేనని రాజకీయవర్గాలు అంటున్నాయి.