Saturday, July 27, 2024

ఎమ్మెల్యే అరూరికి మరో షాక్

Must Read

కాంగ్రెస్ పార్టీలోకి బిల్ల ఉదయ్ రెడ్డి

అక్షరశక్తి, హసన్ పర్తి: ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. వద్దన్నపేట నియోజకవర్గంలో హసన్ పర్తి పిఎసిఎస్ చైర్మన్ బిల్ల ఉదయ్ రెడ్డి తోపాటు 65వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏరుగొండ శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం ఉదయం వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఆర్ నాగరాజు సమక్షంలో వారు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కొద్దిరోజులుగా అసంపర్తికి చెందిన కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి ఎన్నికల ముంగిట ఈ పరిణామాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు పెద్ద షాకేనని చెబుతున్నాయి. బిల్లా ఉదయ్ రెడ్డిని ఎమ్మెల్యే రమేష్ బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రాంతం నుంచి మరికొందరు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ గుడికి చేరడం ఖాయమనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img