అక్షరశక్తి డెస్క్: ఒడిశాలో జరుగుతున్న 40వ సబ్-జూనియర్ మరియు 50వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్ 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో, కాంస్య పతకం గెలుచుకున్న మన తెలంగాణ బిడ్డ తేజస్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ ద్వారా శుభాభినందనలు తెలిపింది. నీ అద్భుత ప్రదర్శన తెలంగాణకు గర్వకారణం అంటూ ప్రశంసించారు. భవిష్యత్‌లో కూడా ఇలాగే రాణించి, మరిన్ని విజయాలను సాధించేందుకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం నీకు అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు.