Monday, September 9, 2024

హైఅల‌ర్ట్‌!

Must Read
  • అన్ని రాష్ట్రాల‌కు కేంద్రం అత్య‌వ‌స‌ర ఆదేశాలు
  • రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద భారీ భ‌ద్ర‌త‌

అగ్నిపథ్‌ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తమైంది. ఆర్మీలో నియామకాలకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ ప‌థ‌కాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొన‌సాగుతున్నాయి. నిన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఆందోళనలు జరగ్గా.. ఆ మంటలు ఇవాళ తెలంగాణకు కూడా విస్తరించాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర విధ్వంసం చేటు చేసుకున్నది. బస్సులపై ఆర్మీ అభ్యర్థులు రాళ్లు రువ్వ‌డంతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రెండు రైలు బోగీలకు నిప్పంటించారు. ఈక్ర‌మంలోనే అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పందించారు. ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చెందవద్దని, అగ్నిపథ్‌ వల్ల యువతకు ప్రయోజనమని తెలిపారు. అగ్నిపథ్‌ ఆందోళనపై నితిన్‌ గడ్కరీ స్పందించారు. అగ్నిపథ్‌ను యువత సరిగా అర్థం చేసుకోవాలని సూచించారు. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం పోతుందని అనుకోవద్దన్నారు. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయన్నారు. అందులో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.

అగ్నిప‌థ్ ఆందోళ‌న‌ల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ దేశ వ్యాప్తంగా పలు రైల్యే జోన్లకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు కాజీపేట రైల్వే జంక్షన్, వరంగల్ రైల్వేస్టేషన్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ల వద్ద అదనపుల బలగాలు మోహరించాయి. రైల్వే పోలీసులతో పాటు సివిల్ పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. భద్రత పెంచి, నిఘా కట్టుదిట్టం చేయాలని శాఖాధిపతులు, సెక్రెటరీలకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది. కాజీపేట రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను స్టేషన్ లోకి రాకుండా స్థానిక పోలీసులు అడ్డుకుంటున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img