అక్షరశక్తి, పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్ నగర్ గ్రామానికి నూతనంగా విచ్చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శి విక్రమ్‌ను కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమం లో గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఉప్ప సర్పంచ్ కత్తుల వెంకన్న యాదవ్ (పెద్ద), మండల బీసీ సెల్ అధ్యక్షులు బందెల వెంకన్న యాదవ్, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడెపు కుమారస్వామి, మాజీ జడ్పీ కో అప్టెడ్ సభ్యులు మహమ్మాద్ సర్వర్, జిల్లా మాజీ సోషల్ మీడియా చైర్మన్ ఎర్రబోయిన సాంబరాజు యాదవ్, గ్రామ ప్రధాన కార్యదర్శి బూత్ ఇంచార్జ్ కత్తుల శ్రీశైలం యాదవ్, ధోనికి కొమురయ్య యాదవ్, గ్రామ మాజీ ఉప్ప సర్పంచ్ బొమ్మర సుధాకర్, గ్రామ సీనియర్ నాయకులు బందెల యాకయ్య, కత్తుల వెంకన్న, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ బత్తిని రాము, కత్తుల రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.