Monday, September 16, 2024

తాళ్లపూసపల్లి అభివృద్ధికి కృషి చేశా..

Must Read

అక్షరశక్తి, మహబూబాబాద్: సర్పంచుల పదవీకాలం ముగియడంతో ఆయా గ్రామాలలో పాలకమండలికి అభినందన సభలు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ఎంపీటీసీలకు పదవీ విరమణ సభను గ్రామస్తులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌గా పాలన చేసిన రావుల విజితారెడ్డి మాట్లాడుతూ ఈ పదవి ద్వారా ఎంతో నేర్చుకున్నానని, తన భర్త రావుల రవి చంద్రారెడ్డి రాజకీయాలలో ఎప్పటి నుంచో కొనసాగుతున్నారని, ఆయన ద్వారా రాజకీయాల్లో రావడం సర్పంచ్ గా ఈ గ్రామానికి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగిందన్నారు. గ్రామానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చిన నిధుల ద్వారానే కాక సొంత ఖర్చులతోనూ త‌న‌వంతు అభివృద్ధి చేశానని అన్నారు. ఈ కార్యక్రమంలో పదవీ విరమణ పొందుతున్న పూసపల్లి ఎంపీటీసీ వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ సమస్యలు నిరంతరం ఉంటాయని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రావుల రవిచంద్ర రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో అనేక సమస్యలను పాలకమండలి సర్పంచ్ ఆధ్వర్యంలో పరిష్కరించిందని తన రాజకీయ అనుభవంతో వారికి చేదోడువాదాడుగా నిలిచా నని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో గ్రామ సెక్రటరీ ఉప సర్పంచ్ నాయకులు కాలేరు మురళి, గొర్రె వెంకన్న, ఉప సర్పంచ్ రమేష్, పంచాయతీ సెక్రెటరీ నాగజ్యోతి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img