అక్షరశక్తి, వరంగల్: నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని, జాగ్రత్తతో మెలగడం వల్ల నేరాలను అదుపు చేయవచ్చని వరంగల్ షీ టీమ్ హెడ్ కానిస్టేబుల్ బి. సూర్యనారాయణ అన్నారు. కాకతీయ హై స్కూల్, ఏకశిలా నగర్‌లో దాదాపు 100 మంది విద్యార్థులకు సైబర్ నేరాలు, మహిళలపై అత్యాచారాలు, విద్యార్థులపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిచగా ఆయన పల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఈవ్ టీజింగ్ మరియు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, T -సేఫ్ అప్ పై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త వహించాలని, సైబర్ నేరాలపై, T -సేఫ్ అప్ పై అవగాహన కలిగి ఉండాలని, అన్నారు. మరియు సైబర్ నేరాలు జరిగితే టోల్ ఫ్రీ1930 కి పిర్యాదు చేయాలి. అన్నోన్ నెంబర్స్ నుండి మహిళలకు ఎవరి నుండైన ఇబ్బందులు గురైనప్పుడు, ఎవరైనా మహిళలపై అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించినట్లైతే ధైర్యంగా షీ టీమ్ వారికి సమాచారం ఇవ్వాలని, మా షీ టీమ్ మొబైల్ నంబర్స్ సిపి వాట్సాప్ నంబర్ 8712685257, సీఐ వాట్సాప్ నెంబర్ 8712685142, ఎస్. ఐ. వాట్సాప్ నెంబర్ 8712685270 కి పిర్యాదు చేయాలని. వివరాలను గోప్యంగా ఉంచి నేరస్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి చర్య తీసుకుంటామని అన్నారు. విద్యార్థులు సమస్యలు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తో పంచుకోవాలని, అలా పంచుకోవడం ద్వారా నేరాలను ప్రాథమిక దశలో నివారించవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వై. రాజేందర్, టీచర్స్ అవినాష్, రాము, దివ్య, స్రవంతి, శ్రీదేవి మరియు షీ టీమ్ నుండి కానిస్టేబుల్ కే. వంశీకృష్ణ, ఉమెన్ కానిస్టేబుల్ సువార్త తదితరులు పాల్గొన్నారు.