అక్షరశక్తి డెస్క్: ఆటోలో ప్రయాణిస్తూ సెల్ ఫోన్ పోగొట్టుకున్న యువతికి సిసి ఎస్ ఇన్స్ స్పెక్టర్ అబ్బయ్య సెల్ ఫోన్ ను శనివారం అందజేశారు. ఇంజనీరింగ్ చదువుచున్న విద్యార్థిని తన సెల్ ఫోన్ ను ఆటోలో పోగొట్టుకోవడంతో సదరు విద్యార్థిని వెంటనే సిఇఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. సిసిఎస్ పోలీసులు సెల్ ఫోన్ ఆచూకీ కనుగొని సెల్ ఫోన్‌ని యజమానురాలికి అందజేయడం జరిగింది. పోయిన సెల్ ఫోన్ ను తిరిగి అందజేసినందుకు విద్యార్థిని పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుకుంది.