- గులాబీ గూటికి కార్పొరేటర్, ఎమ్మెల్యే అభ్యర్థి, జనసేన తూర్పు ఇంచార్జ్..
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్
అక్షరశక్తి, వరంగల్ తూర్పు: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో కారు జోరు మరింత ఊపందుకుంటోంది. ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ ప్రచారంలో అందరికంటే ముందు వరుసలో దూసుకుపోతున్నారు. ఈక్రమంలోనే ఎమ్మెల్యే నరేందర్, తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్కు మరింత బలం చేకుర్చేలా వరంగల్ 42వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్, ఉద్యమ నాయకుడు, 2009లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అచ్చ విద్యాసాగర్, పవన్ కళ్యాణ్ ఫాన్స్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, జనసేన తూర్పు ఇంచార్జి తాళ్లపెళ్లి బాలుగౌడ్ గులాబీ గూటికి చేరుకున్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్, వరంగల్ తూర్పు బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జి బండా ప్రకాష్, ఎమ్మెల్యే, తూర్పు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి ఆధ్వర్యంలో హైదరాబాద్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వీరందరికీ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారి వెంట డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులున్నారు.
Must Read