అక్షరశక్తి, వరంగల్ : వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటరమణ ఆధ్వర్యంలో సి పి ఆర్ కార్డియోఫల్మనేరి రిసాసిటేషన్ /పునర్జన్మపై వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే వెంకటరమణ మాట్లాడుతూ వాయు మార్గం, శ్వాస ప్రసరణ, డిపిబ్రిలేషన్, షాక్ మొదలగు వాటికి సీపీఆర్ చికిత్స చేసి ప్రాణాలను కాపాడవచ్చునని తెలిపారు. సిపిఆర్ చేయు విధానంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకుని, అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తి ప్రాణాన్ని కాపాడవచ్చునని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ గోపాల్ రావు మాట్లాడుతూ సిపిఆర్ చేయు విధానంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారిని డాక్టర్ పద్మశ్రీ, వైద్యాధికారులు, డిప్యూటీ డెమో అనిల్ కుమార్, ఎస్ ఓ విజయలక్ష్మి, డిపిఓ అర్చన, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.