అక్షరశక్తి సుబేదారి: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమస్యల మీద నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జోనల్ ఇంచార్జ్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, అడ్మిషన్ ఫీజుల పేరుతో విచ్చలవిడిగా విద్యార్థుల నుచి ఫీజులు దండుకుంటుంనారని, డిగ్రీ పూర్తయిన విద్యార్థుల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ వసూలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని. పై చదువులకు వెళ్లాలంటే డిగ్రీ పూర్తయినా సర్టిఫికెట్స్ ఎంతో అవసరం కానీ కళాశాల యజమాన్యం సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, కళాశాల భవనం కూడా శిధిల వ్యవస్థలో ఉంది వెంటనే అధిక ఫీజులు నియంత్రించడంతో పాటు.. అన్ని సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, కళాశాల విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.