అక్షరశక్తి పరకాల: నడికుడా మండల పరిధిలోని రాయపర్తి గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన దేవా రైతు సేవ కేంద్రాన్ని బుధవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. దేవ రైతు సేవా కేంద్రం ద్వారా మెరుగైన సేవలను అందిస్తూ, రైతుల నమ్మకాన్ని పెంచేలా నిర్వాహకులు వ్యాపారం కొనసాగించాలని అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. రైతు సేవ కేంద్రాలతో రైతులకు మేలు జరగాలని కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా రైతులకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. రైతులు నియంత్రిత పంటల సాగు విధానాన్ని అవలంభించి డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మాజీఎంపిటిసి చలమల శ్రీలత మల్లారెడ్డి, రకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ తక్కలపల్లి స్వర్ణలత మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.