అక్షరశక్తి, హన్మకొండ: 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణను గుర్తించి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య ఐఏఎస్ , గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని ఐఏఎస్, అంబరీష్ ఐపీఎస్ చేతుల మీదుగా ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు అందజేశారు. పేదవారికి ఉచిత వైద్యం , విద్యలో తోడ్పాటు , కరోనా సమయంలో పేదవారిని చేరదీయడం, రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు అనునిత్యం సేవలందిస్తూ 25 సంవత్సరాల నుండి పేదలకి ఉచిత వైద్యం అందిస్తూ ప్రజలకు సేవ చేస్తూ అనాధలని ఆదుకుంటూ ప్రజలకు అనునిత్యం చేరువలో ఉండి వారి సమస్యల తీర్చే వ్యక్తిగా పేదల పెన్నిధిగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి బెస్ట్ సోషల్ వర్కర్ ఇచ్చినందుకు చాలా సంతోషంతో పాటు రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జిల్లా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మంత్రులు ఎమ్మెల్యే ల సహకారంతో మరింత బాధ్యతతో పేద ప్రజల కోసం సేవ చేస్తానని అన్నారు.