Tuesday, September 10, 2024

మావోయిస్టుల క‌ద‌లిక‌ల‌పై ప్ర‌త్యేక నిఘా ఏర్పాటు చేయాలి – మల్టిజోన్-1 ఐజీపి చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : మహబూబాబాద్ తిన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో మల్టీ జోన్-1 ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా సమావేశానికి విచ్చేసిన ఐజిపీకి జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో సాయుధ బల‌గాల‌ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసుల పనితీరును, నిషేధిత మావోయిస్టుల కదలికల పట్ల ప్రస్తుత స్థితిగతులను జిల్లా శాంతిభద్రతల స్థితిగతులను ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, వారి కదలికలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మావోయిస్టు సరిహద్దు ప్రాంతాల్లో వారు ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడకుండా వారిని నివారించాలని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
నూతన చట్టలపై అందరికి అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేయాలని, కన్విక్షన్ రేట్ ను పెంచాలని అన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడంలో జిల్లా పోలీసులు పనిచేయాలని అన్నారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. పోలీస్ స్టేషన్లో పరిధిలోని ప్రతీ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొనే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు నిత్యం అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ అప్రమత్తం చేయాలని తెలియజేసారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి రావు, ఏ.ఆర్ డిఎస్పీలు శ్రీనివాస్, విజయ్ ప్రతాప్, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img