అక్షరశక్తి, వరంగల్ : వరంగల్ మహానగరంలోని మూడు ప్రధాన కార్పొరేట్ ఆస్పత్రుల్లో విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రధానంగా ఆరోగ్య శ్రీ పథకానికి సంబంధించిన కేసుల రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కొద్దిరోజులుగా కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం అమలులో అవకతవకలపై మీడియాలో కథనాలు రావడంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు సమాచారం.