అక్షరశక్తి, వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషికి ఐజీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీచేసింది.
ఐజీగా పదోన్నతి పొందిన డాక్టర్ తరుణ్ జోషి వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏప్రిల్ 7 వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్వరాష్ట్రం హర్యాన. డెంటల్ డాక్టర్‌గా పట్టా పుచ్చుకుని ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ఐపీఎస్‌గా ఎదిగారు.
2004 ఐపీఎస్ బ్యాచ్ చెందిన తరుణ్ జోషి శిక్షణ అనంతరం గోదావరి ఖని ఏఎస్పీగా, ఆదిలాబాద్ ఓఎస్డీగాను పనిచేసారు. 2009, 2010 సంవత్సరంలో వరంగల్ ఓఏస్డీగా పనిచేసారు. అ తర్వాత వైజాగ్ సిటీ ఎస్పీగాను, గ్రేహౌండ్స్, నిజామాబాద్, హైదరాబాదు సెంట్రల్ జోన్ , ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేసారు. డీఐజీ పదోన్నతిపై హైదరాబాదు స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్‌గా పనిచేసిన అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.