Monday, September 9, 2024

బిగ్ బ్రేకింగ్‌.. టెన్త్ పేపర్ లీక్ కేసు.. విచారణకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్

Must Read

టెన్త్ హిందీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సోమవారం వరంగల్ పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. దీంతో భారీ ఎత్తున బీజేపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు పోలీస్ క‌మిష‌రేట్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. బీజేపీ లీగ‌ల్ సెల్ న్యాయ‌వాదులు కూడా హెడ్ క్వార్ట‌ర్స్‌కు వ‌చ్చారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా క‌మిష‌రేట్ వ‌ద్ద పోలీసులు భారీ భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టారు. కాగా, ఈ కేసులో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని మొదటి నిందితుడిగా చేర్చి అరెస్టు చేసి కరీంనగర్ సెంట్రల్ జైలుకు పంపించిన విషయం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కాగా, బండి సంజయ్ ఇప్పటికే బెయిల్ మీద విడుదలైన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img