Saturday, July 27, 2024

హనుమకొండ జిల్లా పెరిక సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

Must Read
  • ముఖ్య అతిథిగా హాజ‌రైన చీఫ్ విప్ విన‌య్‌భాస్క‌ర్‌
  • అధ్య‌క్షుడు సోమిశెట్టి శ్రీనివాస్‌ను అభినందించిన నాయ‌కులు
    అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హనుమకొండ జిల్లా పెరిక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహో త్సవం ఆదివారం స్థానిక గీతాంజలి మహిళా డిగ్రీ కళాశాలలో అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి కీత విజయ్ కుమార్ నూతన కార్యవర్గంచేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సమావేశానికి హనుమకొండ జిల్లా పెరిక కుల సంఘం అధ్య‌క్షుడు సోమిశెట్టి శ్రీనివాస్ సభాధ్యక్షత వహించగా సంఘం గౌరవ అధ్యక్షులు గజవెళ్లి వేణు మాధవ్, ముఖ్య అతిథిగా చీఫ్ విప్‌, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, విశిష్ట అతిథిగా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, తెలంగాణ రాష్ట్ర పెరిక (పురగిరి క్షత్రియ) సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి కీత విజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర పెరిక ( పురగిరి క్షత్రియ) సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతం ధనుంజయ, ప్రముఖ కార్డియోలజిస్ట్ డాక్టర్ అత్తె భగీరధ్, పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు కానుగంటి శ్రీనివాస్, భూపాలపల్లి ఐన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కట్ల సదయ్య, నీరుకుళ్ల ఎంపీటీసీ పోతరాజు రాజు, ఎర్రబెల్లి గ్రామ సర్పంచ్ గూడ రాజ్ కుమార్ హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా ముఖ్య అతిథి చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ…. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తరువాత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ జిల్లాలో బీసీ కులాలు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పెరిక కుల సంఘం భవనానికి భూమి పూజకు తన‌ వంతు సహకారం ఉంటుందన్నారు. పెరిక భవన్ నిర్మాణానికి తన నియోజకవర్గవర్గ అభివృద్ధి నిధుల నుండి రూ. 20 లక్షలు కేటాయిస్తున్నట్లు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. విశిష్ట అతిథి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం మాట్లాడుతూ… నూతనంగా ఎన్నికైన సంఘం నాయకులు గ్రామీణ కుల సంఘ అభివృద్ధికి కృషి చేయాలని, సంఘ కార్యక్రమాలు విరివిగా నిర్వహించాలని, పరస్పర సహకారంతోనే పెరిక జాతి అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్ర రాజధానిలో పెరిక కుల సంఘం భవన సముదాయాలు అభివృద్ధి చెందాయని, ఇక నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో భవన సముదాయాలు నిర్మించవలసిన అవసరం ఉందని అన్నారు. ఇక నుండి ప్రతి జిల్లా కేంద్రంలో పెరిక కుల విద్యార్థి వసతి గృహాలు నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని కీత విజయ్ కుమార్ పిలుపు నిచ్చారు. అనంతరం హనుమకొండ జిల్లా పెరిక కుల సంఘం గౌరవ అధ్యక్షుడు గజవెళ్లి వేణు మాధవ్ మాట్లాడుతూ… స్వసంఘీయుల ఐక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతుందని, సంఘ సభ్యులకు జిల్లా నాయకత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ… సంఘం ఇక నుండి విద్యా, వైద్య రంగాల్లో సహాయ సహకారాలు అందిస్తుంద‌ని, హంటర్ రోడ్డులో పెరిక విద్యార్థి వసతి గృహం నిర్మాణం కో సం కృషి చేస్తామని తెలిపారు. సంఘ పెద్దలు రిటైడ్ ప్రిన్సిపాల్ ముడిద దామోదర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పెరిక కుల సంఘ అస్థిత్వం ప్రశ్నర్ధకంగా మారిందని, ఇక నుండి ఐనా రాబోయే రోజుల్లో మన నాయకులు చిత్తశుద్ధి తో పనిచేయాలని కోరారు. రామన్ స్కూల్ ప్రిన్సిపాల్ రామినేని రాజేష్ మాట్లాడుతూ వర్తమాన పరిస్థితుల్లో పెరిక యువత కుల రహిత సమాజానికి అలవాటు పడిపోతున్నారని, అలాంటి పరిస్థితులు కొనసాగితే కుల వ్యవస్థ పూర్తిగా అంతరించి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గునిపర్తి మాజీ సర్పంచ్ వడ్డె చంద్రమౌళి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ ముడిద దామోదర్, రామన్ స్కూల్ కరస్పాండెంట్ తీర్థాల పురుషోత్తం, సీనియర్ అడ్వకేట్ నాంసాని చంద్రశేఖర్, హనుమకొండ సంక్షేమ సంఘం నాయకులు అక్కల సంపత్, బిళ్ళా సుదర్శన్, నల్లపు కోటీశ్వర్, దొమ్మాటి భాస్కర్, బెడిద అనిల్, దొంగరి శ్రీనివాస్, బుద్దె గణేష్, చిట్టిబొమ్మల భిక్షపతి, గూడ రాజన్న, మంచాల రాజు, మద్ది రమేష్ బాబు, దొంగరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img