Tuesday, September 10, 2024

కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : ఢిల్లీ మద్యం పాలసీ సీబీఐ కేసులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని ఈ నెల 20 వరకు రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ మేరకు గురువారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కస్టడీ గడువు ముగియడంతో సీబీఐ ఆయనను తిహార్‌ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. మద్యం పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ సరైన కారణం లేకుండా అరెస్టు జరిగిందని చెప్పలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌కు సంబంధించి ఈడీ వాయిదా కోరింది. కేజ్రీవాల్ బెయిల్‌ను రద్దు చేస్తే మళ్లీ అరెస్టు చేస్తారా? అని హైకోర్టు ఈడీని ప్రశ్నించింది. కోర్టు ఈ కేసును సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన తెలిసిందే. ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం సీబీఐ కేసులో తీహార్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img