Tuesday, September 10, 2024

బెంగాల్ మాజీ సీఎం బుద్ద‌దేవ్ భ‌ట్టాచార్య క‌న్నుమూత‌

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ద‌దేవ్ భ‌ట్టాచార్య గురువారం క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 80 ఏళ్లు. 2000 నుంచి 2011 వ‌ర‌కు 11 ఏళ్ల పాటు ఆయ‌న బెంగాల్ సీఎంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. తండ్రి బుద్ద‌దేవ్ మ‌ర‌ణించిన‌ట్లు కుమారుడు సుచేత‌న్ భ‌ట్టాచార్య ప్ర‌క‌టించారు. బెంగాల్‌కు ఆర‌వ సీఎంగా చేశారాయ‌న‌. బెంగాల్‌లో సుమారు 34 ఏళ్లు వామ‌ప‌క్షాలు ప్ర‌భుత్వాన్ని ఏలాయి. దాంట్లో చివ‌రి సీఎంగా బుద్ద‌దేవ్ విధులు చేప‌ట్టారు. కోల్‌క‌తాలోని పామ్ అవెన్యూలో గురువారం ఉద‌యం 8.30 నిమిషాల‌కు ప్రాణాలు విడిచిన‌ట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. చాలాకాలంగా ఆయ‌న ఆరోగ్యం క్షీణించింది. శ్వాస‌కోస వ్యాధితో ఆయ‌న బాధ‌ప‌డుతున్నారు. ప‌లుమార్లు ఆస్ప‌త్రిలో చికిత్స చేయించుకున్నారు. ఇటీవ‌ల నుమోనియా సోక‌డంతో ఆయ‌న లైఫ్ స‌పోర్టుపై ఉన్నారు. మాజీ సీఎం బుద్ద‌దేవ్ భ‌ట్టాచార్య మృతి ప‌ట్ల‌.. బెంగాల్ ప్ర‌తిప‌క్ష నేత సువేందు అధికారి సంతాపం తెలిపారు. ఆయ‌న మ‌ర‌ణం తీవ్ర మ‌న‌స్తాపాన్ని క‌లిగించిన‌ట్లు చెప్పారు. కుటుంబ‌స‌భ్యులు, అభిమానుల‌కు సంతాపం తెలుపుతున్న‌ట్లు త‌న ఎక్స్ అకౌంట్‌లో పేర్కొన్నారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img