అక్షరశక్తి, కమలాపూర్ : కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన మౌటం రాజేష్ ఇటీవల చేపల వేటకు వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న మెపా రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్, కార్యవర్గ సభ్యులు బాధిత కుటుంబానికి సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియా ద్వారా ఆర్థిక సహాయాన్ని కోరారు. ఎంతోమంది మంచి మనసుతో సహృదయంతో వారికి తోచిన డబ్బులను మెపా సభ్యులకు ఫోన్ పే గూగుల్ పే ద్వారా సేకరించి 50వేల రూపాయలను శుక్రవారం బాధిత కుటుంబానికి భరోసా ఇస్తూ ఇద్దరు చిన్నారుల పేరిట పోస్టల్ డిపాజిట్ చేస్తున్నట్లు మెపా రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెపా రాష్ట్ర కార్యదర్శులు దండు చిరంజీవి ముదిరాజ్ సింగారపు రామకృష్ణ ముదిరాజ్ నీరటి రాజు ముదిరాజ్ హనుమకొండ జిల్లా గౌరవ అధ్యక్షులు రావుల రాణా ప్రతాప్ ముదిరాజ్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్మగారి శ్యామ్ ముదిరాజ్ లతో పాటు కమలాపూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉపాధ్యక్షులు మౌటం సుభాష్ పెద్ద మనుషులు మౌటం జయశంకర్ పిట్టల రవి మాజీ అధ్యక్షులు మౌటం శ్రీనివాస్ మౌటం శ్రీనివాస్ మౌటం కుమారస్వామి మౌటం తిరుపతి మౌటం బిక్షపతి మౌటం చిరంజీవి మౌటం సాంబమూర్తి మౌటం సుధాకర్ మౌటం రాజు కుల సభ్యులు పాల్గొన్నారు.