అక్షరశక్తి హనుమకొండ: ఈరోజు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో పదోన్నతి పొంది న ఉపాధ్యాయులతో రాష్ట్రవ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి హనుమకొండ జిల్లా నుండి 4 57మంది ఉపాధ్యాయులు పది బస్సులలో వెళ్లరు. కాగా బస్సులను అడిషనల్ జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించగా, ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ మహ్మద్ అబ్దుల్ హాయ్, డిఆర్డిఏ అడిషనల్ పిడి శ్రీనివాసరావు, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారులు శ్రీమతి బి రాధ, జెండారిక్విటీ కోఆర్డినేటర్ సునీత కార్యాలయ సూపరిండెంట్లు శారద, శైలజ, డీఈవో సిసి కుమారస్వామి, పలువురు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.