Thursday, September 19, 2024

ఐటిఐ క‌ళ‌శాల‌ల్లో నిర్మిస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాల‌జీ కేంద్రాల‌ను ప‌రిశీలించిన – జిల్లా కలెక్టర్

Must Read

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ:హనుమకొండలోని ప్రభుత్వ ఐటిఐ లలో నిర్మిస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాల పనులను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం ములుగు రోడ్లని రెండు ప్రభుత్వ ఐటిఐ లను సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ప్రభుత్వ ఐటిఐ లను ఉన్నతీకరించడానికి ఆధునిక వర్క్ షాపులు, కొత్త యంత్రాలు, పరికరాలు ఏర్పాటు చేయుటకు నిర్మిస్తున్న భవనాలను పరిశీలించారు. భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే కాజీపేట లోని ప్రభుత్వ ఐటిఐ నీ సందర్శించి భవన నిర్మాణం కొరకు స్థలాన్ని పరిశీలించారు. అధికారులు ఆ ఐఐటీలో స్థలం కొద్దిగా ఉందని తెలుపుగా ఆ స్థలంలోనే నూతన భవనం నిర్మాణం కోసం ప్లాను తయారు చేయాలని అధికారులకు సూచించారు. కాజీపేట ఐటిఐ దగ్గరలో ఎలాంటి స్థలాలు లేనందున అక్కడే భవన నిర్మాణం చేపట్టాలని అన్నారు. ఇప్పుడు ఐటిఐ లలో ఉన్న పాత కోర్సులతోపాటు నూతన సాంకేతిక సంబంధమైన కోర్సులు ప్రారంభించడానికి కృషి చేయాలన్నారు. ఐటి ఐ ల్లో చదువుకున్న విద్యార్థులకు ఎంప్లాయిమెంట్ ఎలా ఉందని అధికారులు అడగగా వారు ఆర్టీసీ, టాటా మరియు ఇతర కంపెనీలలో వారికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఐటిఐ లోని అన్ని ల్యాబ్ లను పరిశీలించారు. ల్యాబ్ లో ఉన్న విద్యార్థులతో ముఖా ముఖిగా గా మాట్లాడి వారు నేర్చుకుంటున్న కోర్సుల గురించి తెలుసుకున్నారు. ఐటిఐ లో ఏమైనా సమస్యలు ఉంటే తెలుపవలసిందిగా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ఉపసంచాలకులు సీతారాములు, ప్రిన్సిపాల్ లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img