Tuesday, September 10, 2024

కాళోజి కళాక్షేత్రం ఆగస్టు 20 లోపు పూర్తి చేయాలి

Must Read

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ: కాళోజి కళాక్షేత్రం పనులను ఆగస్టు 20 తారీకు లోపు పూర్తి చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ వెంకటరామిరెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ అశ్విని తానాజీ వాకడేలతో కలిసి జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలో నిర్మాణంలో ఉన్న కాలేజీ కళాక్షేత్రంలో జరుగుతున్న నిర్మాణ పనుల గురించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ మాట్లాడుతూ కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, ఆగస్టు 20 లోగా అన్ని పనులు పూర్తి చేయాలని అన్నారు. నిబంధనల మేరకు నిర్మాణ పనులు ఉండేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాళోజీ కళాక్షేత్రం మొత్తం తిరిగి జరుగుతున్న పనులను పరిశీలించి, ఏ ఏ పనులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని అడిగారు. అదనంగా పనివారిని నియమించి షిఫ్ట్ లవారిగా పని చేయించాలని అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. మిగిలి ఉన్న పనులపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ సీటింగ్ ఏర్పాటు మరియు బాల్కనీ సీటింగు లపై నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచనలు చేశారు. ఈ పనులను ప్రతిరోజు తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కుడా పీవో అభిజిత్ రెడ్డి ఈ ఈ భీమ్రావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img