అక్షర శక్తి పరకాల: పరకాలలో ఏర్పాటు “స్వచ్ఛదనం-పచ్చదనం, ర్యలీ కార్యక్రమాంలో పాల్గొన్న పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ప్రాంతాన్ని పకృతి వనం చేసే ప్రయత్నమే “స్వేచ్ఛదనం-పచ్చదనం”కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆగస్టు 5 నుండి 9 వరకు ఐదు రోజుల కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి మొక్కల పంపిణీ తో పాటు అవి మనుగడ సాధించేలా చర్యలు తీసుకుంటాం, ప్రజల భాగస్వామ్యంతో పరకాల పట్టణ ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రత అవగాహన పెంపొందిస్తాం, ప్రతి ఇంటింటికి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ఇంటి ఆవరణంలో నీళ్లు నిలవకుండా చూసుకోవాలని కోరారు, ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ కమిషనర్ నరసింహ, మున్సిపల్ ఏఈ రంజిత్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పీ రోహిత్ కుమార్, వార్డ్ ఆఫీసర్ వేణు, ఆర్ పీ సుజాత, ఆశ వర్కర్స్ రమ, స్వరూప, లలిత పార్టీ నాయకులు బొచ్చు శ్రీనివాస్, రేండ్ల సంపత్, సాదు రఘువీర్, మోటం శ్రీనివాస్, కొండపల్లి చందు, రెండ్ల పాల్, వార్డు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.