అక్షరశక్తి, వరంగల్ : వరంగల్ మహానగరంలోని ఆక్రమణలను తొలగించడానికి ప్రజలకు మెరుగైన సేవలు అందించటానికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన హైడ్రా లాంటి ఒక స్వతంత్ర ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునాహరి శేషు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. తేలికిపాటి వర్షానికి కూడా నగరంలోని లోతట్టు ప్రాంతాలు కాలనీలు వరద నీటితో మునిగిపోతున్నాయి. నగరంలో ఆక్రమణలను తొలగించడానికి, ఉల్లంఘనలపై చర్యలు చేపట్టడానికి, ఆస్తుల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించటానికి వరంగల్ నగరంలో కూడా హైడ్రా లాంటి స్వతంత్ర ఏజెన్సీ ఏర్పాటుకి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో హైడ్రాకు 200 కోట్ల రూపాయలు కేటాయించిన విధంగానే వరంగల్ నగర అభివృద్ధికి కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక సహాయ నిధి కింద 500 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.