Tuesday, September 10, 2024

బీజేపీలో చేరిన న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి

Must Read

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, అరుణ్ సింగ్, బీజేపీ నేత లక్ష్మణ్ స‌మ‌క్షంలో కాశాయ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 -09 మధ్య కాలంలో శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిశారు. 2010-14 మధ్య కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ 2014 ఫిబ్రవరిలో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీ పేరుతో పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీచేసి ఘోరంగా ఓడిపోయారు.. ఆ తరువాత కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్ కుమార్ అనంతరం తిరిగి సొంత పార్టీ కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img